Guidelines Issued By Sikkim Government for Tourists | అద్దంతో చేసిన స్కైవాక్ పై నడవాలని ఎప్పుడైనా అనిపించిందా.. చైనాలో ( China ) ఇలాంటివి మనకు చాలా కామన్. కానీ ఇప్పుడు మనం భారత దేశంలో ( India ) కూడా స్కైవాక్ చేయవచ్చు. దీని కోసం సిక్కింలో ఇలాంటి అద్దంతో చేసిన స్కై వాక్ బ్రిడ్జ్ ను ప్రారంభించారు. బుద్ధిజానికి నెలవు అయిన సిక్కింలో హిమాలయ పర్వతాల మధ్య ఈ స్కై వాక్ పై నడవడం అధ్బుతమైన అనుభూతిని ఇస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Zero Corona: కెనడాలోని ఈ ప్రాంతంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు


137 అడుగుల చెన్రెజింగ్ స్టాట్యూ ఆఫ్ పెల్లింగ్ ( Chenrezing Statue of Pelling ) వద్ద ఏర్పాటు చేసిన ఈ స్కైవాక్ అధునిక అద్భుతాల్లో ఒకటి.  ప్రార్థనలతో పాటు ప్రశాంతతను కూడా సొంతం చేసుకోవచ్చు.


ఈ స్కైవాక్ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇవే.| Facts About Indian First Skywalk in Sikkim


1. ఈ స్కైవాక్ ను (Sky Walk Sikkim )  2018లో ప్రారంభించారు. అప్పటి నుంచి పర్యాటకులు అద్భుతమైన సైట్ సీయింగ్ అనుభూతిని సొంతం చేసుకుంటున్నారు.


2. ఈ స్కై వాక్ నుంచి తీస్టా, రంగిటీ నదులు పారడాన్ని, వాటి చలనాన్ని చూసి ఎంజాయ్ చేయవచ్చు.



Also Read | 10 Lakh Dollar: దుబాయి లాటరీలో భారత సంతతి వ్యక్తికి కాసుల పంట


3. పెల్లింగ్ నగరం నుంచి ఈ స్కైవాక్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు తెరిచి ఉంటుంది. టికెట్ ధర రూ.50 మాత్రమే.


కరోనావైరస్ ( Coronavirus ) వల్ల సుమారు 7 నెలల పాటు ఈ స్కైవాక్ మూసి ఉంచారు. ఇటీవలే సిక్కిం ( Sikkim) ప్రభుత్వం పర్యాటకుల కోసం ప్రారంభించింది.


Also Read | Dreams and Meanings: మనిషికి వచ్చే 5 పీడకలలు, వాటి అర్థాలు!


పర్యాటకుల కోసం కొన్ని మార్గదర్శకాలను కూడా ప్రారంభించింది.| Guidelines Issued By Sikkim Government for Tourists


1. ముందుగా భారత్ లో నివసిస్తున్న దేశీయ పర్యాటకులు, విదేశీ పర్యాటకులను మాత్రమే సిక్కింలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు.



2. సిక్కింలోకి ప్రవేశించే ముందు కోవిడ్-19 నెగెటీవ్ రిపోర్టును క్యారీ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలోకి ప్రవేశించే 72 గంటల ముందు రిపోర్టు ఉంటే సరిపోతుంది.


3. సిక్కిం చూడాలి అనుకునే పర్యాటకులు రాష్ట్ర టూరిజం పోర్టల్ విజిట్ చేసి అక్కడి నుంచి ట్రావెల్ కార్డును సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. సిక్కింలో ఉన్నంత కాలం ఈ కార్డు అవసరం అవుతుంది.


4. ముందస్తుగానే అకామడేషన్, టూరిస్ట్ ఆపరేటర్ వంటి సర్వీసులు బుక్ చేసుకుని అవి కోవిడ్-19 నియమాలుకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.



Also Read | River in Thar: 2 లక్షల సంవత్సరాల ముందు ఎండిపోయిన నది జాడ దొరికింది


5. 65 సంవత్సరాలు పైబడి వాళ్లు, 10 సంవత్సరాల్లోపు పిల్లల గురించి సిక్కిం ప్రభుత్వం ప్రత్యేక నియమాలు జారీ చేసింది. వారి ప్రయాణం పరిమితంగా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది.


6. ప్రతీ ప్రయాణికుడు ప్రొటెక్టివ్ గేర్, ఫేస్ మాస్కు, షీల్డ్, గ్లవ్స్ థెర్మోమీటర్ అండ్ శానిటైజర్ ను వారే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.


7. ప్రయాణికులు కంటైన్మెంట్ జోన్లలోకి ప్రవేశించకూడదు.



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR